చాలా మంది ఇప్పుడు ఫోన్ వాడేవారు అందరూ హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వాడుతూనే ఉంటున్నారు. కంపెనీలు ఏమైనా చెవిలో మాత్రం ఇవి కినిపిస్తూనే ఉంటున్నాయి. అయితే వీటిని వాడటం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు నిపుణులు, దాదాపు 15 నిమిషాలు నేరుగా హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినడం చెవికి మంచిది కాదు అంటున్నారు.
ఇయర్ ఫోన్స్ 15 నిమిషాలకు మించి వాడితే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. అలా వాడితే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ హెచ్చరించింది. ఇలా సంగీతం వినడం ఫోన్ మాట్లాడటం చేస్తే వారికి అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు.పెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక చెవిలో ఉండే కణాలు చాలా సున్నితంగా ఉంటాయి, ఇవి పెద్ద శబ్దాలు చేస్తే తట్టుకోలేవు అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. ఇక ఒకరి నుంచి మరొకరు ఇయర్ ఫోన్స్ తీసుకోవద్దు ఇది కూడా మంచిది కాదు అంటున్నారు వైద్యులు.