ఇదేం పని బాబు – ప్రియురాలు ఇంటికి వెళ్లిన ప్రియుడు ఏం చేశాడంటే

ఇదేం పని బాబు - ప్రియురాలు ఇంటికి వెళ్లిన ప్రియుడు ఏం చేశాడంటే

0
121

కొందరు వివాహం అయినా అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతారు, అయితే వారికి తెలియకుండా తన హిస్టరీని హైడ్ లో ఉంచుతారు, కాని ఒక్కోసారి అమ్మాయిలకి ఈ విషయం తెలిసి పెళ్లి అయిన తర్వాత నన్ను మోసం చేస్తున్నావా అని పక్కన పెడతారు ..అలాంటి సమయంలో వారిని మరింత వేధించి తమ కోరిక తీర్చుకోవాలి అని భావిస్తారు.

ఇక్కడ ఇలాంటిదే జరిగింది, తన ప్రియురాలికి ఫోన్ చేశాడు, ఆమె లిఫ్ట్ చేయలేదు, అయితే తనకు అంతకు ముందు వివాహం అయింది అని తెలిసిన తర్వాత తనని పక్కన పెట్టింది అని ఆ విషయం తట్టుకోలేకపోయాడు, దీంతో ఆమెని నేరుగా ఇంటికి వెళ్లి కలవాలి అని అనుకున్నాడు.

ఇంటికి వెళ్లాడు కాని ఎవరూ లేరు, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది, అంతేకాదు అక్కడ ఇళ్లు అంతా తిరిగాడు, దీంతో పక్కన వారు అతను దొంగ అని భావించారు, అతనిని ఇంటిలో ఉంచి బయట తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు వస్తే తన జీవితం ఏమి అవుతుందో అని భయపడి ఏకంగా ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయాడు, పాపం అతని భార్య కన్నీరు మున్నీరు అవుతోంది, ఇలాంటి సంబంధాలు కొత్త ప్రేమలు చివరకు విషాదాలే నింపుతాయి అంటున్నారు పోలీసులు.