చాలా మందికి రూల్స్ పెడితే ఏదోలా ఉంటుంది.. ముఖ్యంగా భర్తలు భార్యలకు కండిషన్లు పెడితే అసలు నచ్చదు అయితే జపాన్ లో కూడా మగవారు అమ్మాయిల విషయంలో కాస్త వెనుకే ఉంటారు. వారి మనసులు అంత సులువుగా అర్ధం చేసుకోరు. అయితే టెక్నాలజీలో మాత్రం ముందు ఉంటారు.
సాంకేతికంగా ముందున్నా.. ఆడోళ్లను సంతోష పెట్టటం.. వారిని మహారాణులుగా చూసుకోవటంలో జపనీయులు దరిదాపుల్లోకి రారు అని తెలుస్తోంది. ఇప్పుడు జపాన్ లో మహిళల డ్రెస్సింగ్ పైకూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారట. అంతేకాదు వారిని కళ్లజోల్లు కూడా ఆఫీసుల్లో వాడద్దు అని చెబుతున్నారు, మరీ సైట్ ఉంటే సర్టిపికెట్ చూపించి పర్మిషన్ తీసుకోవాలని చెప్పారట.. స్టైల్ కోసం కళ్లజోడు వాడద్దు అని చెబుతున్నారు.
షూ కాకుండా ఎత్తైన హైహీల్స్ వేసుకోవాలని రూల్ తీసుకొచ్చేశారు. గంటల తరబడి హైహీల్స్ వేసుకోవటం వల్ల కాళ్లు నొప్పులు పుడుతున్నాయని వాపోతున్నారు.జుట్టు కూడా కట్ చేసుకోవడం చేయకూడదు అలాగే అమ్మాయిలు శరీరం బయటకు కనిపించేలా బట్టలు కట్టుకోకూడదు అని కొన్ని కంపెనీలు రూల్ పెట్టాయట. దీనిపైచాలా మంది మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.