ఇక్కడ మహిళలు బికినీలు ధరించడం బ్యాన్

ఇక్కడ మహిళలు బికినీలు ధరించడం బ్యాన్

0
85

మన దేశంలో బికినీలు ధరించి తిరిగే ప్రాంతం అంటే కేవలం గోవా అనే చెప్పాలి, అక్కడ మినహ మన దేశంలో ఎక్కడా బికినీలు ధరించి నేరుగా మహిళలు తిరగరు, స్విమ్ సూట్స్ కూడా ఎక్కడా వేసుకోరు, కాని కొన్ని దేశాల్లో వీటిని అలౌ చేస్తారు, మరికొన్ని దేశాలు అసలు ఎంకరేజ్ చేయరు, మనకు గోవాకు విదేశీ టూరిస్టులు వస్తారు కాబట్టి.అక్కడ బికినీలు పర్మిషన్ ఉంది.

ఇక ముస్లిం కంట్రీస్ లో బికినీలకు అనుమతి ఉండదు, అవి వేసుకుని తిరగనివ్వరు… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రాస్ అల్-ఖైమా రాష్ట్రం, దాని సముద్ర తీరాల్లో పురుషులు, మహిళలు ఇద్దరూ బికినీలు లేదా ఈత దుస్తులు ధరించడం నిషేధించబడింది.

బార్సిలోనా & మల్లోర్కా, స్పెయిన్ ఇక్కడ కూడా బికినీ వేసుకోని వీధుల్లో నడవకూడదు, బీచ్ లో మాత్రమే అనుమతి..ఇలా ఎవరైనా తిరిగే వారికి 500 యూరోలు దాదాపు రూ.39 వేలు జరిమానా విధిస్తారు.

మాల్దీవులు

అందమైన పర్యాటక గమ్యస్థానంగా మాల్దీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ కూడా బికినీ నిషేదం,బీచ్ లో మాత్రమే అనుమతి లేకపోతే ఫైన్ విధిస్తారు.

హ్వార్, క్రొయేషియా
దీనిని ద్వీపంగా పిలుస్తారు, ఇక్కడకు విదేశాల నుంచి సెలబ్రిటీలు, ధనవంతులు వస్తారు, ఇక్కడ పట్టణంలో బికినీ వేసుకుని నడిస్తే అరెస్ట్ ఫైన్ వేస్తారు, ఇక్కడక కూడా రోడ్లపై తినడం తాగడం చేయరు.