పొగతాగేవారికి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.. కరోనా సోకితే ఛాతీ ఊపిరి తిత్తుల ఇన్ ఫెక్షన్ వస్తుందని తెలిపారు… అలాగే స్వాసకోస సమస్య వస్తుందని తెలిపారు…
అలాగే పొగతాగే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో వారికి కరోనా సోకే అవకాశలు 14 రెట్టు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు… అందుకే పొగతాగడం మానుకోవాలని అంటున్నారు…
ఒకే సిగరెట్ ను పలువురు పంచుకొవడం ద్వారా కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు… అలాగే గుట్కా, జరదాలపు తిని రోడ్లపై ఉమ్మడం కారణంగా కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు… ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని అంటున్నారు…