ఒక్కో ప్రాంతంలో ఒక్కో నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా రత్నాలు ఇలాంటి రంగు రాళ్లు ధరిస్తే లాభాలు లైఫ్ లో అద్బుతాలు జరుగుతాయి అని చెబుతారు, అందుకే రంగురాళ్లకు అంత ప్రత్యేకత ఉంది..ఆఫ్రికన్ మైథాలజీ ప్రకారం ఏనుగు స్వర్గానికీ భుమికీ మధ్య వారధి అనేది తెలిసిందే.ప్రపంచంలో ఎక్కడచూసిన ఏనుగుని బాగా ఆరాధిస్తారు పూజిస్తారు. ఏఖండంలో అయినా ఇలాంటి ఫేమ్ ఏనుగుకి ఉంది.
ఏనుగులు సంతానోత్పత్తి సామర్ధ్యానికీ, జ్ఞానానికీ, రక్షణకీ, అదృష్టానికీ ప్రతీకలు. అయితే ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి ఏనుగు వెంట్రుకలు మన దగ్గర ఉంటే ఇక తిరుగు ఉండదు ఆర్దికంగా బాగుంటుంది అని చాలా మంది నమ్ముతారు, అయితే ఏనుగు నుంచి ఆ వెంట్రుకలు సాధారణంగా వస్తే తీసుకోవాలి వాటిని హింసించి తీసుకోకూడదు.
ఏనుగు వెంట్రుక బ్రేస్లెట్ ధరిస్తే ఎలాంటి హానీ జరగదు, జబ్బు చేయడం, దబ్బులు లేకపోవడం వంటి సమస్యలు రావు అని నమ్ముతారు ఆఫ్రీకాలో. ఇది ఆఫ్రీకా ఐరోపాలో చాలా మంది పాటిస్తారు, ఇటీవల మన దేశంలో కూడా చాలా మంది చేయించుకుంటున్నారు దీనిని చుట్టులా మార్చి చేసుకుంటున్నారు, కాని ఇలా ఏనుగు వెంట్రుకలు కలిగి ఉండి వాటితో ఆభరణాలు చేయించుకోవడం నిషిద్దం అని తెలిపారు అధికారులు.