ఏనుగులకి కోట్ల ఆస్తి రాసిచ్చిన వ్యక్తి ఎవరో చూడండి

ఏనుగులకి కోట్ల ఆస్తి రాసిచ్చిన వ్యక్తి ఎవరో చూడండి

0
193

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మరణించింది అనే వార్త అందరిని ఎంతో బాధించింది, ఇలాంటి దుర్మార్గం చేసిన వారిని వదలకూడదు అని అందరూ కోరుకున్నారు, అయితే ఏనుగులని చూడగానే మనకు ఎంతో ఆనందం వేస్తుంది, అలాంటి వాటికి అపాయం చేయడం అంటే ఎవరూ క్షమించరానిది.

అయితే ఓ మహత్ముడు చేసిన పని గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన పేరు అక్తర్ ఇమాం. ఇమాం ఏనుగులకు ఏకంగా రూ.5కోట్ల విలువైన ఆస్తిని రాసి ఇచ్చేశాడు. తన ఆస్తిలో సగం భాగం ఇది.మిగతా సగ ఆస్తిని తన భార్య పేరున రాశాడు, అతను చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

బిహార్కు చెందిన ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్లైఫ్ యానిమల్ ట్రస్ట్ చీఫ్ మేనేజర్ ఇమాం అక్తర్. ఆయన దగ్గర రెండు ఏనుగులు ఉన్నాయి,12 ఏళ్లుగా చూసుకుంటున్నాడు, వాటి పేరు మోతీ, రాణీ, వాటికి స్నానం ఆహరం అన్నీ అతనే పెడతాడు, వాటిపై ప్రేమతో తన ఆస్తి రాసిచ్చాడు ఆయన. నిజంగా గ్రేట్ కదా.