ఆయన చేపల వ్యాపారం చేసేవాడు, తండ్రి ఇచ్చిన 1000 రూపాయలతో చేపల వ్యాపారం చేసి ప్రయోజకుడు అయ్యాడు, రొయ్యలు చేపలు చెరువుల దగ్గర కొని కంపెనీలకు అమ్ముతాడు, ఆయన వయసు 55 ఏళ్లు , ఇక కొడుక్కి గత ఏడాది మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు, ఈ సమయంలో కొడుకు హైదరాబాద్ లో ఫ్యాక్టరీలో పని చేసేవాడు, దీంతో అక్కడ పని మానేసి ఇంటికి వచ్చేశాడు.
దగ్గర్లో ఓ దారాల మిల్లులో పనికి ఇంటి దగ్గర కుదిరాడు, దీంతో కోడలు కుటుంబ సభ్యులు వచ్చి ఇంత ఆస్తి ఉంది మీ అబ్బాయిని 10 వేల జీతానికి పనికి పెట్టారు ఏమిటి అని ప్రశ్నించారు, దీంతో ఆ వ్యాపారి సైలెంట్ గా ఉన్నాడు. ఆస్తి ఉంది కదా అని తిని ఖాళీగా కూర్చొమంటారా అని రివర్స్ ప్రశ్నించాడు.
దీంతో తండ్రి ఓ షరతు పెట్టాడు, మానాన్న నాకు 1000 ఇచ్చి పైకి రమ్మన్నాడు, నేను నా కొడుక్కి దానికి వంద రెట్లు ఇస్తాను 1 లక్ష, ప్రయోజకుడు అయి పైకి రమ్మనండి అని చెప్పాడు, దీంతో ఇప్పుడు ఆ వ్యక్తి దారాల పని మానేసి బండిమీద మసాలా ప్యాకెట్లు ఇంటిలో తయారు చేసి కిరాణా దుకాణాలకు అమ్మే వ్యాపారం మొదలు పెట్టాడు, దీంతో ఈయన ఏం తండ్రి రా అంటున్నారు, కష్టపడి పైకి రావాలి నాలా నా కొడుకు అని అందరితో అంటున్నాడట.