ఎంగేజ్ మెంట్ రింగ్ పోయిందన్న పెళ్లి కూతురు – కాని ఎవరికి ఇచ్చిందంటే

ఎంగేజ్ మెంట్ రింగ్ పోయిందన్న పెళ్లి కూతురు - కాని ఎవరికి ఇచ్చిందంటే

0
101

మాలీపూన్ ప్రాంతంలో ఉండే సారియాకి ఇటీవల లైన్ మెన్ ఉధ్దవ్ తో పెళ్లి కుదిరింది, అయితే అతను అమ్మాయి బాగా నచ్చి ఆమెకి 25 వేల రూపాయల రింగ్ ఇచ్చాడు, ఆమె తరపున వారు ఆశ్చర్యపోయారు, ఎంగేజ్ మెంట్ రోజు ఈ రింగ్ ఆమె వేలికి తొడిగాడు.

అంతా బాగానే ఉంది, అయితే కొద్ది రోజుల్లో వివాహం చేసుకోవాలి, ఈ మధ్య లాక్ డౌన్ సడలింపులతో ఆమెని చూడటానికి ఆమె ఇంటికి వచ్చాడు లైన్ మెన్ ఉధ్దవ్, అయితే ఆమె అతనితో బాగానే మాట్లాడింది, ఈ సమయంలో ఆమె వేలికి రింగ్ లేదు, దీంతో రింగ్ ఏదని అడిగాడు.

ఆమె భయపడుతూ ఇంట్లో ఉంది అని చెప్పింది, ఇక తర్వాత మరోసారి ఇంటికి వచ్చిన సమయంలో కూడా అడిగాడు ఈసారి చూపించమని చెబితే ఏదో సాకు చెప్పింది, దీంతో ఆమెపై కోపంతో వెళుతుంటే పోయింది అని చెప్పింది, దీంతో అతను బాధపడ్డాడు.. నిజం అని నమ్మాడు, కాని ఓరోజు అతని మొబైల్ కు తనకు కాబోయే భార్య సారియా ఆమె ప్రియుడి ఫోటోలు వచ్చాయి, దీంతో వాటిని ఆమెకి చూపించి ప్రశ్నిస్తే అతను తన ప్రియుడు అని ఒప్పుకుంది, అంతేకాదు అతని ఖర్చుల కోసం ఆ రింగ్ ని అతనికి ఇచ్చేశాను అని చెప్పింది.. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకున్నాడు అతను.