ఫేస్ బుక్ లో పెట్టిన ఒక్క ఫోటో ఆ యువ‌కుడి జీవితం మార్చేసింది

ఫేస్ బుక్ లో పెట్టిన ఒక్క ఫోటో ఆ యువ‌కుడి జీవితం మార్చేసింది

0
98

ప‌ర్వ‌త్ అనే యువ‌కుడు ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నా‌డు, స్దానికంగా పెద్ద వ్యాపారి కూతురు రియాని అత‌ను ప్రేమించాడు, ఆమె కూడా అత‌నిని ప్రేమించింది, అయితే ఈ విష‌యం తెలి‌సి రియా తండ్రి ఆమెకి పెళ్లి సంబంధాలు చూడ‌టం మొద‌లు పెట్టాడు, ఆమెని కాలేజీ మాన్పించేశాడు, అయితే ఈ స‌మ‌యంలో ఆమెకు లాక్ డౌన్ లోనే ఇంటిలో పెళ్లి చేయాలి అని భావించాడు.

దీంతో సూర‌త్ లోనే మ‌రో వ్యాపారి సంబంధం తీసుకువ‌చ్చారు, అయితే ఆ రోజు ఆమెకి తాంబూలాలు తీసుకుందాం అనుకునే స‌మ‌యంలో, ఆమెతో ప‌ర్వ‌త్ దిగిన ప‌ర్స‌న‌ల్ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడుప్రియుడు, మొత్తానికి ఈ ఫోటోలు సంబంధం చూసుకునే వారి ఇంటికి చేరాయి.

దీంతో ఆమె క్యారెక్ట‌ర్ పై అనుమానంతో మాకు ఈ పెళ్లి వ‌ద్దు అన్నారు, దీంతో సీరియ‌స్ అయిన రియా తండ్రి, ఈవిష‌యం పై ఫోటోల‌తో స‌హా వెంట‌నే పోలీసుల‌కు అత‌నిపై కంప్లైంట్ ఇచ్చాడు, తన కూతురు పోటోలు వీడియోలు ఉంటే అన్నీ తీసుకోవాలి అని తెలిపాడు, పోలీసులు ఆ యువ‌కుడ్ని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు.