చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, ఇంత ఉన్నాడు అంత పెద్ద పని చేశాడా అని ఆశ్చర్యపోతాము, స్కూల్లో చదువులు గేమ్స్ పైనే వారికి ఇంట్రస్ట్ ఉంటుంది అని అనుకుంటాం, కాని ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి పిల్లలకు, అయితే తన తల్లితో ఉదయం చిన్న విషయంలో గొడవపడ్డాడు ఈ బుడ్డోడు, వయసు 5 సంవత్సరాలు.
వాళ్ల అమ్మను లాంబోర్గినీ లగ్జరీ కారు కొనాలని మారాం చేశాడు. అందుకు అమ్మ ఒప్పుకోలేదని గొడవపడి, ఇంట్లో ఉన్న మరో కారు వేసుకుని, పారిపోయాడు. లాస్ ఏంజిల్స్ లో ఈ ఘటన జరిగింది…హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు, డ్రైవర్ లేకుండా వెళుతూ ఉన్న ఓ కారు కనిపించింది, వెంటనే వారు కారుని చేస్ చేసి ఆపారు.
ఆ కారు నడుపుతుంది ఐదేళ్ల చిన్న పిల్లవాడు, వెంటనే ఆపి పిల్లాడిని పోలీసులు ప్రశ్నించారు, పిల్లాడు జరిగింది చెప్పాడు, మరి ఎక్కడికి వెళుతున్నావు అని పోలీసులు పిల్లాడిని అడిగారు, వెంటనే నేను లాంబోర్గినీ లగ్జరీ కారు కొనడానికి వెళుతున్నా అని చెప్పాడు, మరి ఎంత డబ్బు తెచ్చావని ప్రశ్నించగా, మూడు డాలర్లు చూపించాడు. దీంతో ఆ పోలీసులు షాక్ అయ్యారు, వెంటనే పేరెంట్స్ ని పిలిపించి ఆ పిల్లాడ్ని మందలించి ఇంటికి పంపారు.