నాలుగు రోజులుగా ఏమి తినకుండా నది దగ్గర ఉన్న కుక్క – కారణం ఇదే

నాలుగు రోజులుగా ఏమి తినకుండా నది దగ్గర ఉన్న కుక్క - కారణం ఇదే

0
99

కొందరు మనుషులపై విశ్వాసం కంటే కుక్కలపై పెంచుకోవాలి అని చెబుతారు, నిజమే కుక్కలకి ఉన్న విశ్వాసం మనుషులకి కూడా ఉండదు అనేది కొన్ని ఘటనల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది.. యజమానికి చిన్న ఆపద కలిగిలా అవి విలవిల్లాడతాయి. కళ్లముందే నీటిలో దూకిన యజమాని కోసం ఓ కుక్క నాలుగు రోజులు బ్రిడ్జిపై పడిగాపులు కాసింది.

అతను వెనక్కి వస్తాడు అని అక్కడ ఉంది కాని అతను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అని తెలిసి అక్కడే ఉండిపోయింది, ఇలా ఆ కుక్క కన్నీరు పెట్టిన దృశ్యాలు అందరిని కంటతడి పెట్టించాయి, చాలా వరకూ అందరూ ఇవి సోషల్ మీడియాలో షేర్ చేశారు, ఇది నిజమైన ప్రేమ విశ్వాసం అంటే అని అందరూ అంటున్నారు.

చైనాలోని వుహాన్లో యాంగ్జే నది బ్రిడ్జిపైకి గత నెల 30న రాత్రిపూట ఓ వ్యక్తి వచ్చాడు. కుక్కను రెయిలింగ్ వద్ద ఉంచి నదిలో పడిపోయాడు. అతడు తిరిగి వస్తాడని కుక్క అప్పట్నుంచి ఎదురుచూసింది. ఓ ఫొటోగ్రాఫర్ దాని బాధ చూడలేక ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కాని అది పారిపోయింది, కాని ఆ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.