ఇక్కడ ఫ్రీగా మద్యం దొరికింది పండుగ చేసుకున్న మందు బాబులు

ఇక్కడ ఫ్రీగా మద్యం దొరికింది పండుగ చేసుకున్న మందు బాబులు

0
79

ఎక్కడైనా మద్యం ఫ్రీగా దొరికింది అంటే మందు బాబులు ఇంక అక్కడ వదిలిపెట్టరు, ఇప్పుడు ఇలాంటిదే జరిగింది, ఒక్కోసారి వాహనాల్లో మద్యం రవాణా చేసే సమయంలో ట్రక్కులు ప్రమాదవశాత్తు కిందపడి మద్యం మొత్తం పడిపోవచ్చు.

ఈ సమయంలో మందు బాబులు అక్కడ మొత్తం మద్యం బాటిల్స్ ని తీసుకుంటారు, ఇక ఒక్కోక్కరు చేతికి ఎన్ని దొరికితే అన్నీ మద్యం బాటిల్స్ తీసుకువెళతారు అనేది తెలిసిందే, తాజాగా ఇలాంటిదే జరిగింది.
హైవేలో ఓ వైన్ ట్రక్ యాక్సిడెంట్ అయ్యింది. వైన్ బాటిల్ కార్టన్స్ అన్నీ తిరగబడ్డాయి. అది చూసిన మందు బాబులు బాటిళ్లను ఎగబడి మరీ తీసుకుంటున్నారు. ఇది చెన్నైలో చోటుచేసుకుంది.

చెన్నై తంబరమ్ హైవేపై వైన్ ట్రక్ క్రిందపడిపోయింది. విషయం తెలిసిన స్థానికులు మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఇవన్నీ ఉసిరి కాయలు మామిడియాలు ఏరినట్లు ఏరి సంచుల్లోని మరికొందరు, లుంగీల్లో కట్టి తీసుకువెళ్లారు.. లక్షల రూపాయల సరుకు పోయింది అంటున్నారు యజమానులు.