ఫుల్ గా తినండి స‌గం బిల్లు క‌ట్టండి సూపర్ ఆఫ‌ర్

ఫుల్ గా తినండి స‌గం బిల్లు క‌ట్టండి సూపర్ ఆఫ‌ర్

0
143

మ‌నం రెస్టారెంట్ కు వెళ్లాము అంటే ఒక్కోసారి నాలుగు నుంచి ఐదు వేలు కూడా ఖ‌ర్చు అవుతుంది, అయితే ఈ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఫుల్ గా హోట‌ల్స్ కూడా క్లోజ్ అయ్యాయి, రెస్టారెంట్లు క్లోజ్ లో ఉన్నాయి, అయితే ఈ స‌మ‌యంలో ఓ మంచి ఆఫ‌ర్ ఇస్తుంది ప్ర‌భుత్వం, అదేంటి అనుకుంటున్నారా
ఆ ఆఫర్ చూద్దాం.

మీ ఇష్టం.. మీకు ఎంత కావాలంటే అంత తినండి.. రోజుకి ఎన్ని సార్లైనా మా రెస్టారెంట్ కి రండి.. బిల్లులో సగం పే చేస్తే చాలండి అని కస్టమర్లను ఊరిస్తున్నాయి రెస్టారెంట్లు.. ఇది మ‌న దేశంలో కాదు బాబు, ఇది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫ‌ర్.

ఇది కేవ‌లం ఆగస్ట్ నెలకు మాత్రమే వర్తిస్తుంది. సోమ, మంగళ, బుధ ఈ మూడు రోజులు సగం బిల్లు చెల్లించి ఫుల్లుగా లాగించేయొచ్చు. మొత్తం దేశం అంతా ఈ ఆఫ‌ర్ అమలులో ఉంది, అయితే దేశంలో చాలా వ‌ర‌కూ రెస్టారెంట్లు వ్యాపారం పోయింది, అందుకే ఈ ఆలోచ‌న చేశారు.. 72వేల రెస్టారెంట్లు, కేఫ్ లు, పబ్బులు ఇలా ఎక్కడికి వెళ్లినా సగం చెల్లిస్తే సరిపోతుంది. అయితే వైన్ కి ఆఫర్ లేదు, బిర్యానీ డిసెర్ట్, లంచ్ డిన్న‌ర్ ఫుడ్ ఇలాంటి వాటికి మాత్ర‌మే ఆ ఆఫర్.