బిగ్ బాస్ నాలుగో సీజన్ తెలుగులో ప్రసారమవడానికి అంతా సిద్దం అవుతోంది. ఇక షో ఎప్పుడు ప్రసారం అనేది త్వరలో ప్రోమో విడుదల చేయనున్నారు, ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ సిద్దం అయ్యారు, ముందు హౌస్ లోకి 14 లేదా 13 మందిని పంపుతారు అని తెలుస్తోంది.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది,, అయితే ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా కంటెస్టెంట్స్ వీరే అంటూ వినిపించాయి, తాజాగా మై విలేజ్ షో చానల్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు దగ్గర అయిన గంగవ్వకు బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.
ఆమె కూడా వెళ్లడానికి సిద్దం అయ్యారట.తెలంగాణ యాసతో ఫుల్ కామెడీ పండించే గంగవ్వకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.ఇలా యూ ట్యూబ్ నుంచి పలు సినిమాల్లో కూడా చేసింది ఆమె సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ తో కూడా ముచ్చటించింది. మరి చూడాలి ఇంత పెద్ద వయసు ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ కి పిలుస్తారా అనేది కూడా ఇప్పుడు డౌట్ అంటున్నారు కొందరు నెటిజన్లు. కాని ప్రచారం మాత్రం జరుగుతోంది ,ఆమెకి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఇవ్వనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.