అసలు గంగవ్వకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

అసలు గంగవ్వకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

0
101

బిగ్ బాస్ హౌస్ లో 16 మంది కంటెస్టెంట్లలో ఎవరికి లేని మద్దతు ఫేమ్ గంగవ్వకు వచ్చింది.. మై విలేజ్ షో ద్వారా ఆమె అద్బుతమైన ఆఫర్ ని అందుకుంది అనే చెప్పాలి.. పలు ఇంటర్వ్యూలు సైతం చేసింది, తెలంగాణ యాస ప్రాస బాగా మాట్లాడుతుంది.

పల్లెటూరి పద్దతులు ఆ కట్టుబాట్లు గంగవ్వ మాటలో కనిపిస్తాయి,అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో అందరితో చాలా సరదాగా కనిపిస్తోంది, చాలామంది గంగవ్వ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారు. మొదటి వారం ఆమెకి ఏకంగా 2 కోట్ల ఓట్లు వచ్చాయి.

ప్రతి ఒక్కరూ ఆమెకు మద్దతు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. గంగవ్వ కారణంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు మంచి లాభాన్ని పొందారు. అయితే ఆమె హౌస్ నుంచి వెళ్లిపోతాను అని అనడంతో చాలా మంది ప్రేక్షకులు మాత్రం నువ్వు హౌస్ లో ఉండాలి గంగవ్వ అంటున్నారు, అయితే ఆమెకి భారీగా పారితోషికం ఇస్తున్నారట, ఆమె ఎన్ని వారాలు ఉంటే అన్నీ వారాలకు ఇవ్వనున్నారు నగదు, అయితే మూడున్నర లక్షల రెమ్యునరేషన్ ఆమెకి వారానికి ఇవ్వనున్నారు… అయితే ఆమె ఆ నగదుతో తనకు ఇక అప్పులు లేవు కాబట్టి సొంత ఇంటిని నా జాగాలో కట్టుకుంటాను అని తెలిపింది.