గుండు చేయించుకోవడంతో ఉపాధి పోయింది – అసలు ఏమైందంటే

గుండు చేయించుకోవడంతో ఉపాధి పోయింది - అసలు ఏమైందంటే

0
100

మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన వెంటనే తలనీలాలు సమర్పించుకుంటాం. ఇలా తలనీలాలు సమర్పించి

ఏకంగా ఉపాధి కోల్పోయాడు ఓ యువకుడు…హైదరాబాద్కు చెందిన ఈ యువకుడు ఏడాదిన్నర కాలంగా ఓ సంస్ధ లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అంతేకాదు మంచి రేటింగ్ కూడా అతనికి ఉంది,

 

మొత్తం ఇప్పటి వరకూ అతనికి 1428 ట్రిప్లతో 4.67 స్టార్ రేటింగ్తో ఉన్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాడు. అక్కడ స్వామికి తలనీలాలు ఇచ్చాడు, ఇక్కడ వరకూ బాగానే ఉంది, అయితే మొన్న 27న ఈ యాప్లో లాగిన్ అయ్యేందుకు సెల్ఫీతో ప్రయత్నించాడు. కాని లాగిన్ అవ్వలేదు ,ఎందుకా అని చూస్తే అతని తలకి జుట్టు లేకపోవడంతో

 

యాప్ అతడిని గుర్తించలేదు. ఇలా నాలుగైదు సార్లు ప్రయత్నించడంతో అతడి ఖాతా బ్లాక్ అయ్యింది. కంపెనీకి వెళ్లి తన సమస్య చెప్పాడు, వేరే డ్రైవర్ని పెట్టుకోవాలి అని చెప్పారు, ఇలా నెల రోజుల నుంచి ఈ సమస్య తో తిరుగుతున్నాడు. దీనిపై కంపెనీ వారు కూడా ఈ సమస్య పరిష్కరించేందుకు చూస్తున్నారట. పాపం ఎంత సమస్య వచ్చింది నాయనా అంటున్నారు ఇది తెలిసిన వారు.