గొర్రెల కాపరికి దొరికిన వజ్రం అదృష్టవంతుడు ధర ఎంతంటే

గొర్రెల కాపరికి దొరికిన వజ్రం అదృష్టవంతుడు ధర ఎంతంటే

0
101

తెలుగు గడ్డపై వజ్రాలు దొరుకుతాయి అనేది తెలిసిందే.. ముఖ్యంగా సీమ ప్రాంతాల్లో ఈ వర్షాకాలం వజ్రాలు విలువైన రాళ్లు బయటపడతాయి, అందుకే ఇది బంగారు భూమి అంటారు,ఇలా రైతులకి పంట పొలాల్లో వజ్రాలు విలువైన రాళ్లు దొరికిన సంఘటనలు చాలా ఉన్నాయి.

తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే దీనిని తక్కువకి అమ్మినా ఇది చాలా ఖరీదు అంటుంది అంటున్నారు స్ధానికులు.

ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేది తెలిసిందే, పలువురు వ్యాపారులు ఈ వజ్రాలు కొనేందుకు ఇక్కడకు వస్తారు,తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక ఇక్కడ వారే కాదు పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వజ్రాల వేట కోసం వస్తారు.