అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి ఫిక్స్ అయిందా?

అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి ఫిక్స్ అయిందా?

0
125

అక్కినేని వారసుడు అఖిల్ సినిమాల్లో స‌రైన హిట్ కోసం చూస్తున్నారు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్… ఇక వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చిత్రంలో బాగా కుదిరింది అని అంటున్నారు.

తాజాగా అఖిల్ పెళ్లి కొడుకు కానున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి . అఖిల్ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిపోయిందని, ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అఖిల్ పెళ్లి బాధ్యతలను.. వదిన సమంత తీసుకుందట. ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉందో తెలియ‌దు కాని తాజాగా ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

గతంలో అఖిల్‌కు శ్రేయాభూపాల్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏవో కారణాల కారణంగా ఊహించని విధంగా వారి పెళ్లి ఆగిపోయింది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండనుందని ప్రకటించాడు. మొత్తానికి అఖిల్ పెళ్లి వార్త అయితే ఇప్పుడు తెగ వినిపిస్తోంది.. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కుటుంబం నుంచి ప్ర‌క‌ట‌న వ‌స్తేనే న‌మ్ముతాం అంటున్నారు.