హిజ్రాను ప్రేమించాడు -సహజీవనం చివరకు ఏమైందంటే

హిజ్రాను ప్రేమించాడు -సహజీవనం చివరకు ఏమైందంటే

0
79

కొన్ని ప్రేమలు చివరి వరకూ సాగవు , మధ్యలోనే పాపం ముగిసిపోతాయి, ఇది ఇలాంటి ఘటనే, ఆమె ఓ హిజ్రా ఆమెని ఎంతో ఇష్టంగా ప్రేమించాడు దిలీప్, ఆమెని వదిలి ఉండలేను అన్నాడు, కుటుంబ సభ్యులు ఆమెని మర్చిపో అని చెప్పినా ఏకంగా ఇళ్లు విడిచి కుటుంబాన్ని విడిచి ఆమె సర్వస్వం అనుకుని వెళ్లిపోయాడు, తమిళనాడులో జరిగింది ఈ ఘటన.

అయితే ఆమెని తీసుకుని ఓ గదిలో కాపురం పెట్టాడు, అంతా సజావుగా ఉంది అని అనుకున్నాడు, ప్రేమించిన సమయంలో వారిద్దరూ బాగానే ఉన్నారు, ఈ సహజీవనం సమయంలో నెల రోజులు బాగానే ఉన్నారు, కాని అనూహ్యంగా ఓ దారుణం జరిగింది. పెద్దలు వద్దన్నందుకు బాధ పడ్డారో, కలిసి సమాజంలో ఉండలేము అని మదనపడ్డారో.

చివరకు ఈ జంట మనస్ధాపంతో ఏమీ ఆలోచించకుండా శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.