ఒక యువకుడు హిజ్రాతో పీకల్లోతూ ప్రేమలో పడ్డాడు… ఈ విషయం యువకుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక గదిని అద్దెకు తీసుకుని హిజ్రాతో సహజీవనం చేస్తున్నాడు… కొద్ది రోజుల తర్వాత వీరిద్దరు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు…
ఈ దరుణం పుదుచ్చేరి కారైక్కాల్ జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కారైక్కార్ జిల్లా తిరునల్లారుకు చెందిన దీలీప్ కు ఆరునెలల క్రితం శివానీ అనే హిజ్రా పరిచయం అయింది… ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది… ఇక ఈ విషయం పెద్దలకు తెలిడంతో అతన్ని మందలించారు… తాను శివానీని వదిలి ఉండలేనని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చాడు…
శివాణితో కలిసి ఒక గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు… కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరుచుగొడవపడెవారు… ఈక్రమంలో మరోసారి గొడవపడి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు… ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…
—