హనీమూన్ జరుపుకున్నారని ఆ నగరంపై అణుబాంబ్ వదల్లేదు

హనీమూన్ జరుపుకున్నారని ఆ నగరంపై అణుబాంబ్ వదల్లేదు

0
152

జపాన్ లో ముఖ్య నగరాలు అయిన హిరోషిమా, నాగసాకి ప్రాంతాలపై అమెరికా అణుబాంబులు వదిలింది, దాదాపు లక్షన్నర మంది చనిపోయారు, అయితే ముందు అనుకున్న నగరం వేరు, అది
సాంస్కృతికంగా జపాన్కు ప్రధాన నగరం క్యోటో, అయితే అక్కడ బాంబు వదలాలి అని భావించారు, కాని ఓ వ్యక్తి దానిని ఆపేశారు.

అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టైమ్సన్కు ఆ నగరంపై ఇష్టం ఉంది, అందుకే ఆనగరం పేరు తీసేసి
నాగసాకి పై బాంబు వదలాలి అని ఆదేశించారు. 1920 ప్రాంతంలో హెన్రీ స్టైమ్సన్ క్యోటో నగరాన్ని సందర్శించారట అక్కడే తన హనీమూన్ జరుపుకున్నారు.

అందుకే అణుబాంబు అక్కడ ప్రయోగించలేదు అని చరిత్ర చెబుతోంది. అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ను ఆయన విజ్ఞప్తి చేశారట …దీంతో ఆయన కూడా ఒకే చెప్పారు, 1945 జూలై 24న జపాన్పై అణుబాంబు దాడికి అధికారిక ఉత్తర్వులు వచ్చాయి, తర్వాత క్యోటో పేరును కొట్టివేసి నాగసాకి పేరు రాశారు.