ఇంటి యజమానికి ఫైన్ వేయించిన కోడి ? ఏం చేసిందంటే

ఇంటి యజమానికి ఫైన్ వేయించిన కోడి ? ఏం చేసిందంటే

0
109

ఎక్కడైనా కోడి ఉదయం కూసింది అంటే నిద్ర లేస్తారు ముఖ్యంగా పల్లెల్లో ఇప్పటికి ఇలా కోడి కూత కూయగానే లేచే వారు చాలా మంది ఉంటారు, అయితే ఇలా కోడి కూత కూసింది అని ఆ ఇంటి యజమానికి ఫైన్ వేశారు, మరి ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.

లంబార్డీలోని కాస్టిరగా విదార్దో పట్టణంలో నివశిస్తున్న ఎంగేలో బొలెట్టీ అనే 80 ఏండ్ల వృద్ధుడు కార్లినో అనే కోడి పుంజును పెంచుకుంటున్నాడు. ఆ పుంజు ప్రతిరోజూ ఉదయం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు నాన్స్టాప్గా కూస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లో వారికి బాగానే ఉంది కాని చుట్టు పక్కల వారికి ఇది చాలా ఇబ్బంది అయింది.

దీంతో చుట్టు పక్కల వారు యజమాని మీదకు గొడవకు వచ్చారు, చివరకు ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇరుగుపొరుగు వాళ్లు.200 డాలర్లు సుమారు రూ. 15 వేలు జరిమానా విధించారు. చివరకు ఇరుగు పొరుగు వారి గురించి ఆ బాధ పడలేక దానిని పదేళ్లుగా పెంచుకుంటున్న యజమాని దానిని ఫ్రెండ్ కు ఇచ్చేశాడు.