100 మంది అన్నలకు గారాల చెల్లి దుస్సల ? ఆమె చరిత్ర

100 మంది అన్నలకు గారాల చెల్లి దుస్సల ? ఆమె చరిత్ర

0
163

కుటుంబంలో ఒక్క చెల్లి అక్క ఉంటేనే ఎంత బాగా చూసుకుంటారు, అలాంటిది నూరుగురికి ఓ చెల్లి అంటే ఎంత ప్రేమ ఉంటుంది… ఓసారి ఆలోచించండి అంతటి ప్రేమ పొందింది దుస్సల.
దుస్సల ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి.. ఆమెని సింధు దేశ రాజు సైంధవుడు వివాహం చేసుకున్నాడు.

గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువు బూడిదరంగులో ఉన్న ముద్దలాగా పుడుతుంది.

ఈ సమయంలో వ్యాసుడు గాంధారి గర్భస్థ శిశువుని 101 భాగాలుగా విభజించి మట్టికుండల్లో నిల్వచేస్తాడు
అలా 100మంది సోదరులు, ఒక సోదరి దుస్సల జన్మించారు..ఇక పాండవులకి కూడా ఆమె సోదరి అవుతుంది, పాండవ కౌరవుల మధ్య చెలిమి కోసం ఆమె ప్రయత్నించింది.