బిగ్ బాస్ 2 ఫైనల్ కు ఇద్దరు అతిధులు

బిగ్ బాస్ 2 ఫైనల్ కు ఇద్దరు అతిధులు

0
142

తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ కార్య‌క్ర‌మం ఫైన‌ల్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తుండగా, కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా నాగార్జున‌ని ఆహ్వానించిన‌ట్టు ఇదివ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక తాజాగా బిగ్ బాస్ సీజ‌న్1 కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి కార్య‌క్ర‌మాన్ని ఎంతో ర‌క్తి క‌ట్టించిన ఎన్టీఆర్ కూడా ఫినాలేకి హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. ఇటీవ‌ల బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఎన్టీఆర్ క‌లిసి ఈ విష‌యంపై మాట్లాడ‌గా, ఆయ‌న అంగీక‌రించాడ‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే ఒకే వేదిక‌పై నాని, నాగార్జున‌, ఎన్టీఆర్‌ల సంద‌డి బుల్లి తెర ప్రేక్ష‌కులకి ఏ రేంజ్‌లో వినోదాన్ని అందిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి వీరిద్ద‌రు వ‌స్తున్నార‌న్న వార్త‌లు నిజ‌మా కాదా..అని తెలియాలంటే గ్రాండ్ ఫినాలి వ‌ర‌కు ఆగాల్సిందే.