ఇంట్రెస్టింగ్ న్యూస్…. చిరు చిత్రంలో ఎన్టీఆర్…..

ఇంట్రెస్టింగ్ న్యూస్.... చిరు చిత్రంలో ఎన్టీఆర్.....

0
106

సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా తీస్తున్నాడు… గతంలో ఎన్నడు లేని డిఫరెంట్ స్టైల్ లో కొరటాల శివ చిరును ఈ చిత్రంలో చూపించనున్నారని సమాచారం.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… దీంతో చిరు ఫ్యాన్స్ తమ అభిమానిని కొత్త స్టైల్ లో చూడబోతున్నామని అనుకుంటున్నారు…

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని నిన్న మొన్నటివరకు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపించాయి… కొరటాల, మహేష్ బాబు కాంబినేషన్ వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. అందుకే ఆయన కోరిక మేరకు మహేష్ ఈ సినిమాలో నటిస్తానని ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి… దాని తర్వాత మరో వార్త హల్ చల్ చేసింది… మహేష్ నటించబోయే ఈ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తారని గుసగుసలు వినిపించారు…

ఇక ఈ వార్త అలా ఎండ్ అయిందో లేదో మరో వార్త హల్ చేస్తోంది సోషల్ మీడియాలో…. 40 నిమిషాల పాటు సాగే ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది… ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంతో తెకెక్కబోయే మరో చిత్రంలో నటిస్తున్నాడు… ఇప్పటికే త్రివిక్రమ్ కథను కూడా పూర్తి చేసుకున్నాడు ఎన్టీఆర్ డేట్స్ ఇస్తే చిత్ర బృందం షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి…