జూన్ 21 సూర్య‌గ్ర‌హ‌ణం ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌

జూన్ 21 సూర్య‌గ్ర‌హ‌ణం ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌

0
102

ఏడాది తొలి సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది. అయితే గ్ర‌హ‌ణ ప్ర‌భావంతో గ్ర‌హాల మార్పుతో ఓ ఆరు రాశుల‌పై జాత‌కంలో కాస్త ప్ర‌తికూల ప్ర‌భావం క‌నిపిస్తుంది అంటున్నారు పండితులు.
ఈ సూర్యగ్రహణం వల్ల రాశిచక్రంలో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉండ‌నుంది.
ముఖ్యంగా 6 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. మూడు రాశుల వారికి మంచి జ‌రుగ‌బోతోంది, మీనం, సింహ‌, మేషం ఈ మూడు రాశుల వారికి బాగానే ఉంటుంది.

ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే రాశులు చూస్తే

వృషభం..
వీరికి ఇంటిలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి, ఉద్యోగ బాధ‌లు ఉంటాయి, రుణ బాధ‌లు పెరిగిపోతాయి. కంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మిథునం..
ఈ సూర్యగ్రహణం మిథున రాశివారికి అంత మంచిది కాదు. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి, రుణ బాధ‌ల‌తో పాటు పిల్ల‌ల‌తో కాస్త వివాదాలు ఉన్నాయి.

కర్కాటకం..
ఇంటికి డ‌బ్బు న‌ష్టాన్ని చూపిస్తోంది, ఖ‌ర్చులు త‌గ్గించండి, పిల్ల‌ల కోసం చూసే వారికి కాస్త నిరాశ క‌లుగుతుంది.

వృశ్చికం..
సూర్యగ్రహణం మీ రాశిచక్రం 8వ పాదంలో ఉండబోతోంది. ప‌లు ఇన్ ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశం ఉంది వైద్యుడిని సంప్ర‌దించండి.

ధనస్సు..
ఈ సూర్యగ్రహణం మీ రాశిచక్రంలోని 7వ పాదంలో జరగబోతుంది.. ఈ రాశి వారికి ఇంటి కోసం రుణాలు చేస్తారు.

కుంభం..
రాశిచక్రం 5వ పాదంలో సూర్యగ్రహణం జరగబోతోంది. వివాహం ప్రేమ‌లో కాస్త వెనుక‌ప‌డ‌తారు.