జూన్ లో రెండు గ్రహణాలు ఎప్పుడు ఏ గ్రహణమో తెలుసుకోండి

జూన్ లో రెండు గ్రహణాలు ఎప్పుడు ఏ గ్రహణమో తెలుసుకోండి

0
147

గ్రహణాలు జ్యోతిష్యాలు రాశులు నక్షత్రాలు ఇలా నమ్మకాలు చాలా మందికి ఉంటాయి..
జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, పండితులు దీని ప్రకారమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేస్తారు. ఇక ఈ నెలలో రెండుసార్లు గ్రహణం ఉంది.

మొదటి చంద్రగ్రహణం. జూన్ మొదటి వారంలో చంద్రగ్రహణం జూన్ 5 రానుంది. జ్యేష్ఠ పూర్ణిమ రోజు రానున్న ఈ గ్రహణం ఈ ఏడాది రెండోది. చంద్రగ్రహణం జూన్ 5 లేదా ఆరు తేదీల్లో అర్ధరాత్రి సమయంలో ఏర్పడనుంది. ఇక తర్వాత సూర్య గ్రహణం ఉంది, అది కూడా జూన్ నెలలోనే ఏర్పడుతోంది.ఇది ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.

జ్యేష్ట మాసంలోని పూర్ణిమ రోజైన జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు గ్రహణం అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతుంది. జూన్ 6న తెల్లవారు జామున 2.34 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది.
ఇది భారత్ లో అందరూ చూడవచ్చు కనిపిస్తుంది….ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడింది.

ఇక సూర్య గ్రహణం జూన్ 21న ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం దాదాపు 5 గంటల 48 నిముషాల 3 సెకండ్ల పాటు కొనసాగనుంది. ఇది కూడా మన దేశంలో అందరూ విక్షీంచవచ్చు.