కాజల్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది

కాజల్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది

0
93

సినిమా తారలకు పెళ్లి అనే వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి … టాలీవుడ్ లో బాచిలర్స్ హీరోలు చాలా మంది ఉన్నారు.. మరి హీరోయిన్లు కూడా పెళ్లి అంటే అరవై అడుగులు పారిపోయే ముద్దు గుమ్మలు ఉన్నారు.. 30 వయసు దాటినా వారు పెళ్లి అంటే ముందుకు రావడం లేదు.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అందాల చందమామ సినీ నటి కాజల్ అగర్వాల్ పైనా అవే తరహా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే కాజల్ కు చాలా మంది అనేక సార్లు పెళ్లి ఫిక్స్ అని వార్తలు రాశారు..మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఆమె ఓ వ్యాపారవేత్తని వివాహం చేసుకుంటోంది అని వార్తలు వదిలాయి .

ఈ రోజు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసింది తన పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి అని మీడియా ముఖంగా చెప్పేసింది తన పెళ్లి గురించి తానే తెలియజేస్తానని చెప్పింది. తెలుగు చిత్రాలు చేస్తాను, కథలు వింటున్నా నచ్చితే చేస్తా అని చెప్పింది ఈ అందాల తార.