కాకులే ఎందుకు పిండాలు తింటాయి? కాకులకి ఎవరు వరం ఇచ్చారు ?

కాకులే ఎందుకు పిండాలు తింటాయి? కాకులకి ఎవరు వరం ఇచ్చారు ?

0
281

కాకిని చూడగానే మనం వెంటనే మన పితృదేవతల రూపంలో కనిపిస్తున్నాయి అని భావిస్తాం, నిత్యం కొన్ని లక్షల కాకులు ఇలా పిండ ప్రధానాలు చేసిన చోట అవి ముట్టి వారిని సంతృప్తి పరుస్తాయి, అందుకే భారతీయ పురాణాలలో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

కాకి శని దేవుడి వాహనంగా ఉంది. హిందూ సాంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. ఇక ఆ ఇంటి పెద్ద కాకి రూపంలో వచ్చి ఆ క్రతువుల తర్వాత పిండం ముడతారు అని చెబుతారు.

ఎందుకు కాకులే ఇలా వాటిని స్వీకరిస్తాయి అంటే ? దీని వెనుక ఓ చరిత్ర కథ ఉంది.
రావణబ్రహ్మ నవ గ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు రావణుడిని చూసి యమధర్మరాజు భయపడతాడు. ఈ సమయంలో అక్కడ కాకి ఉంటే పారిపోయే మార్గం అడుగుతాడు, అప్పుడు కాకి
తనలో ప్రవేశించమని చెప్తుంది ..

వెంటనే కాకిలో అతను ప్రవేశించగానే కాకి ఎగిరి దూరంగా వెళుతుంది, దీంతో కాకి చేసిన సాయానికి యముడు కాకికి ఒక వరం ఇస్తాడు.. నీకు ఎవరు అయితే అమావాస్య నాడు కానీ బంధువ్లులు చనిపోయిన తిథిలో కానీ ఆహారం పెడతారో, ఆ ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో కూడా ఆనందం పొందుతారు అని వరం ఇస్తాడు, అందుకే ఆనాటి నుంచి నేటి వరకూ ఇది ఆచారంగా వస్తోంది.