కార్తీకమాసంలో ఈ పనులు చేస్తే సకల పాపాలు పోతాయి తప్పక చేయండి

కార్తీకమాసంలో ఈ పనులు చేస్తే సకల పాపాలు పోతాయి తప్పక చేయండి

0
130

ఈ కార్తీక మాసం అంటేనే పండుగల నెల ప్రతీ రోజు పండుగ వాతావరణం ఉంటుంది .. ఇక సోమవారం ఆ శివయ్యకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అభిషేకాలు చేస్తారు, కచ్చితంగా ఈ కార్తిక మాసంలో చేయవలసినవి కొన్ని ఉన్నాయి అవి చేస్తే చాలా మంచిది ఇంటికి శుభం అలాగే ఆ శివయ్య కరుణ మనమీద ఉంటుంది.

కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించాలి, ఇలా కుదరని వారు కచ్చితంగా ఈ నెల రోజుల్లో ప్రతీ సోమవారం తలస్నానం చేయాలి..సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి.

అంతేకాదు కార్తిక శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయడం వలన ఆ ఇంటిలో అంతా శుభాలు జరుగుతాయి.
ఈ నెల రోజుల్లో శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించాలి. అలాగే ఈనెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడు పువ్వులతోనూ పూజించాలి ఇలా చేస్తే ఆ దేవుడి కరుణ చూపు మనపై ఉంటుంది, ముఖ్యంగా శివాలయాలు వైష్ణవ ఆలయాలు కూడా భక్తులతో ఈ కార్తిక మాసం కిటకిటలాడుతాయి, అంతేకాదు పాలతో చేసిన ఏ పదార్ధం ప్రసాదంగా ఇచ్చినా ఈ నెల మంచిదే.