యూ ట్యూబ్ లో సంవత్సరానికి 184 కోట్లు సంపాదిస్తున్న బుడ్డోడు ఏం చేస్తాడో చూడండి

యూ ట్యూబ్ లో సంవత్సరానికి 184 కోట్లు సంపాదిస్తున్న బుడ్డోడు ఏం చేస్తాడో చూడండి

0
99

గతంలో మనకు ఏదైనా వస్తువు గురించి తెలియకపోతే ఎక్స్ పెర్ట్ లేదా పెద్దవాళ్లని అడిగేవాళ్లం.. కాని మన చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏ విషయం అయినా క్షణాల్లో యూట్యూబ్ లో తెలుసుకుంటున్నాం, యూ ట్యూబర్స్ చాలా మంది తమ టాలెంట్ ని కూడా ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు, తమకు అవకాశాలు వచ్చేలా చేసుకుంటున్నారు..

ఎంటర్ టైన్మెంట్ రంగం అంతా యూట్యూబ్ ని షేక్ చేస్తోంది అని చెప్పాలి, అయితే ఫేమ్ తో పాటు మనీ కూడా సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు, మిలియనీర్లు అయిన వారు ఉన్నారు.. ర్యాన్ కాజీ అనే ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఛానెల్ 2019 ఆదాయం రూ.26మిలియన్ డాలర్లు అంటే రూ.184 కోట్లకు పై మాటే. 2015లో పెట్టిన ఈ చిన్నారి చానెల్ నెమ్మెదిగా క్రమంగా ఊపందుకుంది.

ర్యాన్ టాయ్స్‌రివ్యూ అనే పేరిట మొదలైన ఛానల్ 22.9మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించగలిగింది. ఇప్పటి వరకూ సుమారు 1000 కోట్లు సంపాదించాడు అంతేకాదు ..ఒక వీడియోకు 35బిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆశ్చర్యకరమైన విషయమే. అందరికి ఇతని రివ్యూలు నచ్చి రోజూ చూస్తూనే ఉంటారు. యూట్యూబ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ర్యాన్‌ మొదటిస్థానంలో ఉన్నాడు.