కొబ్బ‌రికాయ కోసం య‌జ‌మానిని చంపేసిన భ‌క్తుడు

కొబ్బ‌రికాయ కోసం య‌జ‌మానిని చంపేసిన భ‌క్తుడు

0
94

గుడిలోకి వెళ్లిన స‌మ‌యంలో మ‌నం దేవుడికి కొబ్బ‌రికాయ కొడ‌తాం, అయితే కొన్ని సార్లు ఆ కొబ్బ‌రికాయ‌లు కుళ్లిపోవ‌డం కురిడీగా మారిన‌వి రావ‌డం జరుగుతుంది, అయితే ఇది అరిష్టంగా భావించి మ‌నం వేరే కొబ్బ‌రికాయ తీసుకుంటాం.. సాధార‌ణంగా మ‌న దేశంలో ఇలా కొబ్బ‌రి కాయ ఎక్క‌డ కొన్నా కుళ్లిపోయింది అంటే మ‌ళ్లీ ఆ షాపు య‌జ‌మాని కొత్త కొబ్బ‌రికాయ ఉచితంగా ఇస్తారు.

అది దేవుడికి కాబ‌ట్టి అలా అమ్మ‌కూడ‌దు అని వారు భావిస్తారు, అయితే తాజాగా నార్త్ ఇండియాలో ఓ దేవాల‌యానికి వెళ్లిన భ‌క్తుడు అక్క‌డ దేవ‌స్ధానం షాపులో కొబ్బ‌రికాయ కొన్నాడు, అది కొట్టే స‌మ‌యానికి మొత్తం కుళ్లిపోయింది, వెంట‌నే ఇది కుళ్లిపోయింది మ‌రొక‌టి ఇవ్వాలి అన్నాడు.

అయితే ఈ కాయ మా షాపులో కొన‌లేదు అని షాపు య‌జ‌మాని వాధించాడు, దీంతో ఇక్క‌డ రెండు గంట‌ల క్రితం తీసుకువెళ్లాను మీద‌గ్గ‌రే కొన్నాను అన్నాడు, దీంతో వినిపించుకోలేదు, భ‌క్తుడు కోపంతో అక్క‌డ అదే సైజులో ఉన్న కొబ్బ‌రికాయ తీసుకుని య‌జ‌మాని త‌ల‌పై కొట్టాడు… వెంట‌నే అత‌ను కింద‌ప‌డిపోయాడు.. ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన స‌మ‌యంలో అత‌ని మెద‌డు చిట్లి చ‌నిపోయాడు అని తెలిపారు డాక్ట‌ర్లు.. గుడికి పుణ్యానికి వెళితే చివ‌ర‌కు ఆ భ‌క్తుడు చెర‌సాల‌కు వెళ్లాడు, కోపం ఆగ్ర‌హం ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు, చివ‌ర‌కు ఇలాంటి ప‌రిస్దితులే ఎదురు అవుతాయి.