తల్లిదండ్రిని కాదు అని నగరానికి వచ్చాడు మూర్తి.. తన తండ్రి చెప్పిన పని చేసుకుని పల్లెటూరిలో బతికితే ఏమీ సాధించలేము అని, తండ్రిలా గుమస్తాగా బతకాలి అని భావించాడు.. రెండెకరాలు కవులకు ఇచ్చిన తండ్రి ఆ డబ్బుతోనే తన చదువు సాగించాడు.. తన జీతంతో ఇల్లు గడిపాడు. తన జీవితం అలా ఉండకూడదు అని భావించి మూర్తి నగరానికి వచ్చాడు.
ముందుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర చేరాడు.. అతని దగ్గర మేనేజర్ గా ఉంటూ ల్యాండ్ ఎలా కొనాలి డిస్ప్యూట్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి నేర్చుకున్నాడు.. తన తండ్రికి చెప్పి మన రెండు ఎకరాలు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అన్నాడు ..తండ్రి ముందు జంకినా వాడి భవిష్యత్తు కదా అని రెండు ఎకరాలు అమ్మి 6 లక్షలు ఇచ్చాడు..
ఆ పెట్టుబడి అతనికి మూలధనం నుంచి కుబేరుడ్ని చేసింది.. నేడు వందల కోట్ల రూపాయలకు ఆస్తిపరుడ్ని చేసింది.. తన తండ్రి ఎక్కడ రెండు ఎకరాలు అమ్మాడో దానికి నాలుగు వైపులా రెండు వందల ఎకరాలు కొన్నాడు.. ఫామ్ హౌస్ కట్టాడు ..తన తండ్రి పనిచేసిన రైస్ మిల్ కొన్నాడు, అలాగే తనుచదువుకున్న స్కూల్ బాగుచేయించి మంచి విద్య అలాగే స్కూల్లొ సౌకర్యాలు కల్పించాడు.. తన స్నేహితులకి తన కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, దీనికి కారణం తన తండ్రి తనపై పెట్టిన నమ్మకం అని అంటాడు మూర్తి… రియల్లీ తన కంటే తన తండ్రికే కంగ్రాట్స్ చెప్పాలి, నమ్మకంతో ఆ రెండు ఎకరాలు అమ్మి ఇవ్వకపోతే మూర్తి ఇంకా ఏదో ఉద్యోగంలోనే ఉండేవాడు.