కొరటాల – ఎన్టీఆర్ సినిమాలో ఆ భామ – భారీ రెమ్యునరేషన్?

Koratala ,NTR movie -this heroine Huge Remuneration

0
120

తెలుగులో చాలా మంది బాలీవుడ్ అందాల తారలు ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో కూడా భాగమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ తెలుగులో ఓ సినిమా చేయనున్నారు అని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రిన్స్ మహేష్ బాబుతో ఆమె భరత్ అనే నేను సినిమాలో నటించింది . ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కియారా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం కియారా రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది డబుల్ అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.