కుంకుమ పువ్వు తో ఏం చేస్తారు అసలు ఇది దేనికి వాడతారో తెలుసా

కుంకుమ పువ్వు తో ఏం చేస్తారు అసలు ఇది దేనికి వాడతారో తెలుసా

0
106

మనకు కుంకుమ పువ్వు పేరు చెప్పగానే బిర్యానీ పాయసం హల్వా బ్రెడ్ మీటా వీటిలో వాడతారు అని తెలుసు, అయితే అనేక ఔషదాలకు కూడా దీనిని వాడతారు, అంతేకాదు దీనిని తలకి కేసరిగా కూడా వాడేవారట, పూర్వం రాజులు నడిచి వస్తే వారి పాదాల కింద దీనిని వేసేవారట, కుంకుమపువ్వు కలిపిన నీళ్లతో స్నానం చేసేవారట కొందరు రాణులు.

శాఫ్రాన్ను తిలకంగా అద్దుకునేవారు. ఆరోజుల్లో డబ్బుకు బదులుగా దీనిని వాడేవారట
దుస్తుల అద్దకం, జుట్టుకి రంగు, స్నానం చేసేందుకూ వాడినట్లు తెలుస్తోంది. ఇక పలు ఔషదాలకు ఇప్పుడు దీనిని వాడుతున్నారు.

బిర్యానీ స్వీట్లకు ఫైవ్ స్టార్ హోటల్స్ రిచ్ కుటుంబాలు దీనిని కిలోల లెక్కన కొంటారు, ఇక మందుల కంపెనీలు చాలా వరకూ వీటిని బల్క్ గా కొనుగోలు చేస్తారు, సౌందర్య ఉత్పత్తులకు కూడా క్వింటాల్లలో కొంటారు. ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ కుంకుమ పువ్వు వాడతారు. అలాగే యునానీ, ఆయుర్వేద వైద్యంలో వాడతారు.