అత్తారింటికి దారేది సినిమా లో సీనియర్ హీరోయిన్

అత్తారింటికి దారేది సినిమా లో సీనియర్ హీరోయిన్

0
147

తెలుగు లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో శింబూ హీరోగా తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ మేనత్త పాత్రలో నదియా నటించి .. మంచి మార్కులను కొట్టేసింది.

నదియా క్రేజ్ ను పెంచేసిన ఈ పాత్రను తమిళంలో ఖుష్బూ చేస్తోంది. తన కెరియర్లోను ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఖుష్బూ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది .. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.