కాళ్లు నీలం రంగులో మారిపోతున్నాయని ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి

కాళ్లు నీలం రంగులో మారిపోతున్నాయని ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి

0
88

గతంలో డాక్టర్ దగ్గరకు వెళ్లి ఏదైనా సమస్య వస్తే చూపించుకునే వాళ్లం కాని ఇప్పుడు ఆ సీన్ మారింది.. చాలా వరకూ ఆన్ లైన్ యాప్స్ తో, వెబ్ సైట్స్ తో అన్నీ తెలుసుకుంటున్నారు, చిన్న డిసీజ్ వచ్చినా వెంటనే వెబ్ సైట్ లో చూడడం ఆన్ లైన్ డాక్టర్ ని సంప్రదించడం వెంటనే ప్రికాషన్ తీసుకోవడం జరుగుతోంది.. అయితే ఇలా దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నీ నష్టాలు ఉన్నాయి అనేది తాజాగా కొన్ని సంఘటనలతో తెలుస్తోంది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మార్క్ ష్రేబర్ అనే వ్యక్తి.. తన కాళ్లు గత కొన్ని రోజులుగా నీలం రంగులోకి మారడాన్ని గమనించాడు, దీని గురించి వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్నాడు.. ఇది ఏ వ్యాధికి సంబంధించింది అని ప్రశ్నించాడు, అయితే దీనిపై ఇది డీప్ వీన్ త్రాంబోసిస్ వ్యాధి అని ఆ వెబ్సైట్ తేల్చేసింది.

దీంతో మరింత కంగారుపడ్డ మార్క్ ష్రేబర్.. వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించాడు. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకు వైద్యులు షాకింగ్ నిజాన్ని చెప్పారు. అతనికి ఏ వ్యాధి రాలేదు అని చెప్పారు, కేవలం కొత్తగా కొనుకున్న జీన్స్ను వాష్ చేయకుండా అలాగే వేసుకోవడం వల్లే కాళ్లు నీలం రంగులోకి మారాయని తేల్చేశారు. బాబోయే ఈ ఆన్ లైన్ డాక్టర్లు వెబ్ సైట్లని నమ్మకండి అని వెంటనే ఏదైనా సమస్య వస్తే డాక్టర్ ని సంప్రదించండి అని చెప్పాడు.