లాక్ డౌన్ వేళ అందరూ ఇంటిలోనే ఉంటున్నారు, ఈ సమయంలో పిల్లలు పెద్దలు అందరూ ఇంటిలో ఉండటంతో మహిళలకు పని ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇక టీవీలతోనే కాలక్షేపం చేస్తున్నారు అందరూ.
ఇక పిల్లలకు కూడా టీవీలో సీరియళ్లు సినిమాలు చూపిస్తున్నారు, కాని ఇటీవల మళ్లీ రామాయణం మహాభారత్ సీరియల్స్ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి, ఎప్పటి సీరియల్స్ నో మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు, అయినా లక్షలాది మంది వాటిని చూస్తున్నారు.
ఈ సమయంలో పిల్లలు కూడా ఈ సీరియల్స్ చూస్తున్నారు, కాని అందులో నటులు చేసిన విధంగా పిల్లలు కూడా అదే విధంగా చేస్తున్నారట. పిల్లలు కలిసి బాణాలు, విల్లులు తయారు చేసి ఆడుకుంటున్నారు, అక్కడలా బాణాలు చేసి వేసుకోవడంతో అవి కంటికి తగులుతున్నాయి, ఇలా దాదాపు ఈ 40 రోజుల్లో 26 కేసులు వచ్చాయట..చీపురు పుల్లలతో బాణాలు తయారుచేసి వేస్తున్నారు, దీంతో డాక్టర్లు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని తెలియచేస్తున్నారు.