లాక్ డౌన్ వేళ మొసలి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికో తెలిస్తే షాక్

లాక్ డౌన్ వేళ మొసలి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికో తెలిస్తే షాక్

0
106

ఈ లాక్ డౌన్ వేళ వలస కూలీలు పని చేసే చోటు నుంచి తమ సొంత గ్రామాలకు వలస వెళుతున్నారు.. కాని ఇక్కడ విచిత్రంగా జంతువు కూడా లాక్ డౌన్ వేళ వలస వెళ్లింది ఈ విషయం తెలిసి అధికారులు ప్రజలు కూడా షాక్ అయ్యారు. ఓ మొసలు ఏకంగా రాష్ట్రాలు దాటేసింది. ఏకంగా 1100ల కిలోమీటర్లు ప్రయాణించింది.

దీని జర్నీ గురించి ఆ మొసలి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..అంతరించిపోతున్న సరీసృపాల జాబితాలో ఉన్న ఘరియాల్ అని పిలిచే ఓ మొసలి పశ్చిమ బెంగాల్ల్లో కనిపించింది. నేపాల్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ 1100 కిలోమీటర్లు ఈదుతూ హుగ్లీ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది.

ఇది వింతగా ఉంది అని చూసి వారు ఫారెస్ట్ అధికారులకి చెప్పారు, ఈ సమయంలో అధికారులు దాని తోక దగ్గర పరిశీలించారు, ఆ గుర్తులు పరిశీలిస్తే నేపాల్ అధికారులు రాప్తి నదిలో విడిచిపెట్టిన మొసలి గుర్తులు కనిపించాయి, దీంతో అక్కడ అధికారులని అడిగితే ఇదే అన్నారు, మొత్తానికి 61 రోజుల పాటు ..1100కిలోమీటర్లు ప్రయాణించి బెంగాల్ కు వచ్చింది.