లాక్ డౌన్ వేళ పళ్లుఅమ్ముకున్న టీచర్ కు భారీ సాయం చేసిన స్టూడెంట్స్

లాక్ డౌన్ వేళ పళ్లుఅమ్ముకున్న టీచర్ కు భారీ సాయం చేసిన స్టూడెంట్స్

0
97

ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయారు.. మరికొన్ని విద్యా సంస్దలు ఏకంగా జీతాలు కూడా ఇవ్వని పరిస్దితి.. ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. ఇలా ఓ ఉపాధ్యాయుడు కుటుంబ పోషణకు తోపుడు బండి పై అరటి పండ్లను అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్త నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యింది.

కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏకంగా మాస్టార్లకు టీచర్లకు జీతాలు ఇవ్వని పరిస్దితి.. దీంతో వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు..నెల్లూరులో ఇలా ఓ టీచర్ తెలుగు సబ్జెక్ట్ చెబుతున్నాడు ప్రైవేట్ స్కూల్లో. ఆయన ఇప్పుడు ఇలా పళ్లు అమ్ముకుని కుటుంబం పోషించడంతో ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కు ఈ విషయం తెలిసింది.

తాము పై స్థాయికి రావడానికి కారణమైన ఆయన రుణం తీర్చుకోవాలని అనుకున్నారు.వెంటనే తమ వంతు తక్షణ సాయంగా రూ. 86 వేలు అందజేశారు. దీంతో ఆయన ఎంతో ఆనందించారు.