ఈ కరోనా ప్రపంచాన్ని లాక్ చేసింది, బయటకు ఎవరూ రాకుండా ఇంటి పట్టునే ఉన్నారు, మార్చి 22 నుంచి మన దేశంలో లాక్ డౌన్ కనిపిస్తోంది, అన్ లాక్ నడుస్తున్నా కేసులు పెరగడంతో మరికొన్ని చోట్ల లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
దాదాపు మూడు నెలల పాటు లాక్డౌన్ విధించారు. అయినా కేసులు తగ్గడం లేదు, అయితే ఈ కరోనా సమయంలో చాలా మంది డిఫరెంట్ ఫుడ్స్ ఇంట్లోనే చేసుకున్నారు, బయట హోటల్స్ లేకపోవడంతో అందరూ ఇంటి ఫుడ్ కి అలవాటు పడ్డారు.
ఇక కొన్ని చోట్ల అన్ లాక్ పిరియడ్ లో రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి, దీంతో చాలా మంది విపరీతంగా ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏమిటో తెలుసా బిర్యానీ…. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వాటిలో బిర్యానీకే మొదటి స్థానం వచ్చింది, లక్షల్లో బిర్యానికి ఆర్డర్లు వచ్చాయి.బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయి.. రెండో స్థానంలో బటర్ నాన్ రోటీ, 3.31 లక్షలతో మసాలా దోశ మూడో స్థానంలో నిలిచాయి, అది మన దేశంలో బిర్యానికి ఇచ్చే స్ధానం… అందరూ బిర్యానీ లవర్స్ అనే చెప్పాలి.