ప్రేమించి మోసం చేసిన యువకుడు…

ప్రేమించి మోసం చేసిన యువకుడు...

0
134

కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల మాయమాటలు నమ్మి మోసపోతుంటారు…. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది…. ఒక యువతి కోచింగ్ వెళ్లాలని ట్రైన్ ఎక్కింది అదే ట్రైన్ లో యువకుడు పరిచయం అయ్యాడు… ఆ యువకుడు కూడా ఆర్ ఆర్ బీ కోచింగ్ వెళ్తున్నాడు…

అదే సమయంలో వెంకటేష్ తన కోచింగ్ ఐడీ కార్డ్ ను ఆమెదగ్గర మరిచి పోయాడు.. ఈ కార్డు అతడికి అవసరం ఏమోనని ఆ యువతి ఐడీ కార్డ్ మీద ఉన్న నంబర్ కు ఫోన్ చేసి చెప్పింది… తాను ఇప్పుడు వేరే చోట ఉన్నానని చెప్పాడు అలా కొద్దిరోజులు ఫోన్ మాట్లాడిన తర్వాత తాను కావాలనే ఐడీ కార్డ్ మరిచిపోయానని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు…

కొద్దిరోజుల తర్వాత ఆమె కూడా ప్రేమించడం స్టార్ట్ చేసింది.. నెల రోజుల తర్వాత ఆమె కూడా కోచింగ్ వెళ్లింది దీంతో వీరిద్దరు కలవడంతో గర్భం దాల్చింది… విషయం ఆ యువకుడికి చెప్పింది దీంతో వివాహం చేసుకున్నారు.. ఇప్పుడు గర్భం తీయుంచుకోవాలని చెబుతున్నాడు భర్త…. అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో కులం పేరుతో దూషిస్తు ఆమెను తిడుతున్నాడు… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది..