లవ్ చేసుకున్నారు పెళ్లికి సిద్దమయ్యారు ? సినిమా స్టోరీలా ఎండింగ్

లవ్ చేసుకున్నారు పెళ్లికి సిద్దమయ్యారు ? సినిమా స్టోరీలా ఎండింగ్

0
94

నాలుగు సంవత్సరాలుగా ఈ జంట ప్రేమించుకున్నారు, అయితే పెళ్లికి రెడీ అయ్యారు, ఈవిషయం ఆ అమ్మాయి అన్నయ్యకు తండ్రికి తెలిసింది, వారికి ఈ పెళ్లి ఇష్టం లేదు, , ఈ సమయంలో గతంలో పంచాయతీ జరిగింది, అయినా వారు తమ ప్రేమని నిరూపించి వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు.

ప్రేమికులు ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి యువతి తమ్ముడితో కలిసి కారులో పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తుండగా యువతి అన్నయ్య మోటార్ సైకిల్పై కారును అడ్డగించాడు. కారులో ఉన్న ప్రేమికుడిని అక్కడ ఉన్న టెలిఫోన్ స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగింది.

దీంతో అందరూ షాక్ అయ్యారు, ఏదో సినిమాలో జరిగినట్లు ఈ ఘటన జరిగింది. మొత్తానికి అతనిని అక్కడే తాడుతో కట్టి కొట్టాడు, దీంతో పోలీసులు అక్కడకు వచ్చి అతనిని ఆస్పత్రికి తరలించారు యువతి అన్నయ్యపై కేసు నమోదు చేశారు.