ప్రియురాలి కోసం ప్రియుడు సాహసం… చివరకు….

ప్రియురాలి కోసం ప్రియుడు సాహసం... చివరకు....

0
82

ప్రియురాలు కోసం ప్రియుడు సాహసం చేసాడు… చివరకు చావు దెబ్బతిన్నాడు..ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తెన్నమనాడు ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు వడక్కికోట గ్రామానికి చెందిన యువతి ప్రేమలో పడ్డారు… తాజాగా యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి పిలవడంతో తన స్నేహితుడిని తీసుకుని వడక్కికోటకు వెళ్లాడు…

అర్థరాత్రి ఒంటిగంట సమయంలో వారిద్దరు ప్రేయసికోసం వేచి చేస్తున్నారు… ఈ క్రమంలో ఇద్దరు యువకులు గ్రామస్థుల కంట పడ్డారు… దీంతో వారు దొంగలని భావించి దాడి చేశారు… చెట్టుకు కట్టి చితకబాదారు… దీంతో వారిద్దరు స్పృహ కోల్పోయారు.. ఆతర్వాత పోలీసులకు సమాచారం అందించారు…

వారిద్దరు దొంగలు కాదని సదరు యువతి పిలిచిన తర్వాతే వారు గ్రామానికి వచ్చారని తెలిపారు.. ఆమె వచ్చే వరకు ఇంటి సమీపంలో వేచి చూస్తున్న వేళ గ్రామస్తులు చూసి దాడి చేశారని తెలిపారు.. వారిపై దాడి చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు…