ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్…

ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్...

0
92

ఈ సంఘటన శివగంగైలో జరిగింది… శివగంగైకు చెందిన విజయ్ అనే యువకుడు విదేశాల్లో ఉన్నాడు… అతడు మదురైకు చెందిన ఒక యువతిని ప్రేమించాడు.. ఇటీవలే ప్రేమ విషయం అమ్మాయి కుటుంబికులకు చెప్పారు కానీ వారు అంగీకరించలేదు… దీంతో ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారు…

విదేశాల్లో ఉన్న విజయ్ కు ఈ విషయం తెలిసింది దీంతో అతను శివగంగైకు తిరిగి వచ్చారు… అయితే ఎయిపోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ రూపంలో వైద్యాధికారులకు చిక్కాడు… దీంతో విజయ్ ని ఆసుపత్రికి తరలించారు అతని రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించారు…

తన ప్రేయసిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో విజయ్ ఆసుపత్రినుంచి తప్పించుకుని ఆమె తీసుకువెళ్లాడు దీంతో ఆసుపత్రిలో ఒక వ్యక్తి పరార్ అయ్యారని పోలీసులకు వైద్యులు ఫిర్యాదు చేశారు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు.. అతనికి అతని ప్రియురాలికి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపారు..