ప్రియురాలు మోజులో పడి యువకుడు నిండు జీవితాన్ని పాడు చేసుకున్నాడు

ప్రియురాలు మోజులో పడి యువకుడు నిండు జీవితాన్ని పాడు చేసుకున్నాడు

0
93

ప్రియురాలు మోజులో పడి ఓ యువకుడు నిండు జీవితాన్ని పాడు చేసుకున్నాడు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడు సీఏ చదువుతున్నాడు… అతను ఓ యువతిని ప్రేమించాడు… ప్రస్తుతం ఆయువతి ఇంజనీరింగ్ చదువుతోంది… తనతో ఏకాంతంగా మాట్లాడటానికి కొత్త అవతారం ఎత్తాడు…

తాను ఇదే కళాశాలకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ అంటూ బిల్డప్ ఇచ్చి కళాశాలలో ఉన్న ప్రిన్సిపల్ ను పరిచయం చేసుకున్నాడు… ఓ యువతి పేరు చెప్పి అమెను విచారించాల్సిన అవసరం ఉందని ఆమెను తన వద్దకు పంపాలని కోరాడు..

అతని ప్రవర్తలో తేడా వచ్చిన ప్రిన్స్ పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. తాను తన ప్రియురాలితో ఏకాంతంగా మాట్లాడాలనే ఉద్దేశంతో రా అవతారం ఎత్తానని చెప్పాడు…