చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే తప్పుడు పనులతో చేష్టలతో విధ్యార్దులని పెడదోవ పెడుతున్నారు, అంతేకాదు హింసకు గురిచేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఓ స్టూడెంట్ కు లెక్టరర్ ఫోన్ చేశాడు.. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ పెట్టాడు, నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పాడు. తర్వాత రెండు గంటల వరకూ చాలా మెసేజ్ లు పెట్టాడు. తర్వాత వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఆమెని మెసేజ్ లతో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు తన కామ వాంచ తీర్చమని కోరాడు.
అయితే తన భార్య లేదని తన ఇంటికి వచ్చి వంట చేసి వెళ్లాలి అని కోరాడు.. అంతేకాదు తన కోరిక తీరిస్తే నీకు ఎన్ని మార్కులు అయినా వేస్తా పాస్ చేయిస్తా, అలాగే నీకు డబ్బులు కూడా ఇస్తా అని చెప్పాడు. దీంతో సదరు విద్యార్థిని ఉదయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు అధ్యాపకుడి బాగోతం బయటకు వచ్చింది. మొత్తం మెసేజ్ లు అన్నీ కూడా అందరికి చూపించింది.
దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు వీసీ. అయితే మెసేజ్ లు వద్దు అని చెప్పినా, అతను వినకుండా చేసి ఫోన్లు చేశాడు, చివరకు ఫోన్లో వేధించడంతో అవన్నీ కూడా పోలీసులకు రికార్డు చేసి అందచేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలి అని వీసీని గవర్నర్ ఆదేశించారు.