పూరిని కలిసిన మహేశ్.. సినిమా ట్రాక్ లో పడ్డట్టేనా ?

పూరిని కలిసిన మహేశ్.. సినిమా ట్రాక్ లో పడ్డట్టేనా ?

0
114

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భూకంపాలు రావటం గ్యారెంటీ అన్నా స్టాంపు ముద్రలు ఉన్నాయి. వాటిలో ఒకటి పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే మహేష్ బాబు అభిమానులతోపాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కలెక్షన్లు కొల్లగొట్టడం జరిగింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా వచ్చిన పోకిరి సినిమా మహేష్ బాబు కి తిరుగులేని స్టార్ డమ్ తీసుకువచ్చిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరీర్ నే మార్చింది.

ఒక విధంగా చెప్పాలంటే పోకిరి ముందు మహేష్ బాబు పోకిరి తర్వాత మహేష్ అన్నట్టుగా పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ తో మహేష్ బాబు కి మైండ్ బ్లాక్ మతిపోయే విధంగా హిట్ ఇచ్చాడు. ఇటువంటిది కొన్నాళ్ల తర్వాత పూరి జగన్నాధ్ కి వరుస ప్లాపులు రావడంతో…అటువంటి సమయంలో మహేష్ బాబు తో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేసిన మహేష్ తనకి అవకాశం ఇవ్వలేదని…దానికి కారణం ఫ్లాపుల్లో నేనున్నానని అంటూ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు పూరి చేయడం జరిగింది.

దీంతో పూరి మహేష్ బాబు గొడవ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇండస్ట్రీ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఇటీవల పూరి జగన్నాథ్ మహేష్ బాబు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారని ఫిలింనగర్ టాక్.ఇస్మార్ట్ శంకర్ చూసిన మహేష్‌. పూరిని కబురంపాడని, ఈ సినిమా గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారని.. మాటల మధ్యలో పూరి చేసిన కామెంట్ల ప్రస్తావన ఎక్కడా రాలేదని, దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారం మొత్తాన్ని మహేష్ లైట్ తీసుకున్నాడని అర్థమవుతోంది. దీంతో మహేష్ బాబు పూరి జగన్నాథ్ సినిమా రాబోయే రోజుల్లో ట్రాక్ లో పడినట్టే అని అంటున్నారు చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు.