మహిళలు బైక్ పై వెళుతుంటే ఇది తప్పకుండా తెలుసుకోండి – జాగ్రత్త

మహిళలు బైక్ పై వెళుతుంటే ఇది తప్పకుండా తెలుసుకోండి - జాగ్రత్త

0
136

చాలా మంది మహిళలు బైక్ నడిపే సమయంలో వారి వెనుక వీల్ లో ఒక్కోసారి చున్నీ అడ్డుపడి కింద పడిన సందర్బాలు ఉన్నాయి, ఇలాంటి సమయంలో చీర కొంగు కూడా జారిపోయి కింద చక్రంలో ఇరక్కుని కింద పడ్డ సంఘటనలు ఉన్నాయి, ఈ సమయంలో గాయాలే కాదు ప్రమాదంలో ప్రాణాలు కూడా కొందరు కోల్పోతున్నారు.

బైక్ పై వెళుతున్న ఓ మహిళ తన ముఖానికి కట్టుకున్న మాస్క్, బండి వెనుక చక్రంలోకి ఇరుక్కుని కిందపడేయటంతో దుర్మరణం పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో జరిగింది. తీవ్ర విషాదం నింపింది, ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు.

ముఖానికి చుట్టుకుని ఉన్న స్కార్ఫ్ ప్రమాదవశాత్తూ, వెనుక చక్రంలోకి ఇరుక్కుంది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, వెనుకు కూర్చున్నఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించింది. అందుకే డ్రైవ్ చేసే వారు అయినా వెనుక కూర్చున్న మహిళ అయినా కచ్చితంగా బైక్ నడిపే సమయంలో వీల్ లోకి ఇవి వెళ్లకుండా చూసుకోండి